2 May, 2026 | 3:34 AM

ఘట్‌కేసర్ సర్కిల్‌లో మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్షారెడ్డి పర్యటన

02-05-2026 02:22 AM

ఘట్ కేసర్, మే 1 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డి శుక్రవారం ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలను అధికారులతో కలిసి ఫీల్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల ప్రజలతో సమావేశమై ఫ్రైడే డ్రై డే కార్యక్రమంపై అవగాహన కల్పించారు.

గృహాలలో దోమల లార్వా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలను వివరించారు. అలాగే జోడిమెట్ల, మిరాలం కుంట వద్ద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించి పెద్ద ఎత్తున యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేపట్టి దోమల పెరుగుదలను నియంత్రించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం శిల్పానగర్ పార్క్ను సందర్శించి స్వయం సహాయక సంఘాలకు తగు శిక్షణ ఇవ్వడం ద్వార పార్క్ నిర్వహణను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నాగారం డివిజన్లో గుర్రపు డెక్క తొలగింపు పనులను కూడా పరిశీలించారు. ఇట్టి కార్యక్రమంలో  ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, అన్ని శాఖల అధికారులు, సానిటేషన్ సిబ్బంది, వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.