15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బెట్టింగ్ ముఠా అరెస్టు

05-04-2025 02:40 AM

నగదు సెల్ ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాలను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. నగరంలోని భారతీరాణి కాలనీకి చెందిన షేక్ ముజీబ్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఐదో టౌన్ సిబ్బంది  తనిఖీ చేశారు. 

మొబైల్ లో బెట్టింగ్ సంబంధించిన ఆధారాలు ఉండటంతో షేక్ ముజీబ్తో పాటు షేక్ నదీమ్, షేక్ జునైద్, షేక్ రెహాన్లను అరెస్టు చేశాం. మరో నలుగురు షకీల్, నజీబ్, సచిన్, రమేష్ పరారీలో  ఉన్నారు. సాలూరకు చెందిన షకీల్ కు నాందేడ్ లో నివాసముంటున్న సచిన్ తో పరిచయం ఏర్పడి.. ఆన్లైన్  బెట్టింగ్ ఏజెంట్ గా చేరాడు. అనంతరం వీలైనంత మందిని బెట్టింగ్ పట్ల ఆకర్షితులను చేశాడు.

ఏజెంట్ ద్వారా ఎంపిక చేసిన వ్యక్తులకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. కానీ, అందులో విత్ డ్రా చేయలేక పలువురు మోసపోయారు. సుమారు వెయ్యి మందిని బెట్టింగ్ దందాలోకి దించారు.  మూజీబ్ 7 శాతం కమీషన్ పొందినట్లు విచారణలో తేలింది.

నిందితుల నుంచి రూ.50 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, బ్యాంక్ పాస్ బుక్కు లు, క్రెడిట్, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఐదో టౌన్ ఎస్త్స్రలు గంగాధర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.

 పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు? 

ఆర్మూరు డివిజన్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుల అరెస్టు వివరాలను సైతం సీపీ వెల్లడించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఆర్మూర్ సిబ్బంది ఎనిమిది మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇందులో గౌతమ్, సునీల్, రంజిత్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.6 వేల నగదు, 34 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సైమహేష్ పాల్గొన్నారు.