calender_icon.png 4 September, 2025 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ లీగ్స్‌లో భద్రాచలం క్రీడాకారుల అద్భుత ప్రదర్శన!

01-09-2025 07:40:03 PM

భద్రాచలం (విజయక్రాంతి): హెచ్‌సీఏ(HCA) హైదరాబాద్ క్రికెట్ లీగ్స్‌లో చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ భద్రాచలంనకు చెందిన ముగ్గురు అండర్-14 క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఈ యువ క్రీడాకారుల ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముగ్గురు యువ ప్రతిభావంతులు పట్టణానికి చెందిన ప్రసన్న కుమార్ 75 బంతుల్లో 79 పరుగులు సాధించి జట్టు గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించాడు.

అతని బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. మరొక క్రీడాకారుడు చంద్ర 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. అలాగే, ప్రేమ్ సింగ్ అనే మరో ఆటగాడు 6 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయాన్ని సులభతరం చేశాడు. ఈ ముగ్గురు క్రీడాకారులను, వారికి శిక్షణ ఇచ్చిన చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ కోచ్ కుప్పాల శరణ్ తేజను పలువురు అభినందించారు. ఈ యువ ప్రతిభావంతులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.