29-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ చేసిన త్యాగం, దేశం కోసం చేసిన సేవ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ మోచి బజార్లో భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలు,దేశం కోసం చేసిన త్యాగం నేటి యువతకు స్పూర్తి దాయకమన్నారు.ప్రపంచం లో అత్యధిక యువకులు కలిగిన దేశం భారతదేశం అని,నేటి యువత దేశ భవిష్యత్తును మార్చే శక్తిగా మారాలన్నారు.యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉన్నత స్థాయిలో ఆలోచనలు చేయాలని,గొప్ప స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యేవెంట నాయకులు అడువాల లక్ష్మణ్,అరవింద్,భాను తేజ,అఖిలేష్,మారుతి,విశాల్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ... షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ యువతలో చైతన్యం నింపి, జాతీయ ఉద్యమానికి ఉత్తేజితులను చేసిన యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు.
భారత మాత స్వేచ్చ కోసం నవ్వుతూ.. నవ్వుతూ ఉరి కంభానికి ఎక్కిన ఆ మహా వీరుని స్ఫూర్తిని తీసుకొని దేశం కోసం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కీనపెళ్లీ కాశీనాదం, చిట్ల గంగాధర్, సింగం గంగాధర్, గాజుల నగేష్, వేముల పొచమల్లు, సిరిపురం గంగారాం, కృష్ణ, బోందుకురి శ్రీనివాస్, భగత్ సింగ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.