29-09-2025 08:52:31 AM
సుద్దాలలో దొబ్బల స్వామి స్మరాక వాలి బాల్ టోర్ని
మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య
కొనరావుపేట (విజయక్రాంతి): నేటి యువత డ్రగ్స్ కు గంజాయికి దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మించాలని అని సుద్దాల గ్రామం లో దొబ్బల స్వామీ స్మరక మండల స్థాయి వాలిబాల్ పోటీల్లో ఈ సందర్బంగా అన్నారు.ఈ సంధర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య మాట్లాడుతూ...నేటి యువత రేపటి భవిత అని అలాంటి యువత దేశా నిర్మాతలుగా ఎదగలిసినది పోయి గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు అయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దిని వల్ల వీరి మీద ఆధారపడిన కుటుంబాలను వీధి పాలు చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత యువత మీదే ఉందని అన్నారు. క్రీడల ద్వారా మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. గ్రామంలో తన తండ్రి దొబ్బల స్వామి స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ను వారి కుమారులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
అనంతరం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు దొబ్బల ప్రవీణ్ మాట్లాడుతూ మా నాన్న దొబ్బల స్వామి స్మారకర్ధంగా టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మా నాన్న కూడా సామాజిక సేవలో ముందు ఉంటూ అనేక సమస్యలను పరిష్కారించిన వ్యక్తి అని అన్నారు.అందుకే ఈ టోర్నమెంట్ ను నిర్వహించ జరిగిందని దీనికి మండల వ్యాప్తంగా 20 టీములు రావడం జరిగిందని హోరాహోరీగా జరిగినటువంటి టోర్నమెంట్లో మొదటి విజేతగా సుద్దాల గెలువగా రెండవ విజేత మామిడిపల్లి జట్టు నిలిచిందని తెలిపారు. ఇట్టి టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కర్రోళ్ల భాస్కర్, మాజీ సర్పంచ్ కచ్చకాయల బాల్ రెడ్డి ,మాజీ విద్యా కమిటీ పాఠశాల చైర్మన్ ఎర్రవెల్లి విజయ్ కుమార్, బి యర్ స్ నాయకులు కచ్చకాయల మహేష్, పర్షరం రాకేష్, అన్వేష్,అంజయ్య,కాంగ్రెస్ నాయకులు అవురం సురేష్ ,మాసం జనార్ధన్, నీరటి రవి, బీఎస్పీ నాయకులు నరేష్ ,ప్రశాంత్,ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.