29-09-2025 08:46:14 AM
ముస్తాబాద్, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద శ్రీదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్న నవరాత్రోత్సవంలో భాగంగా ఆదివారం రోజున అమ్మ భవాని స్వాములు ఉదయం అమ్మవారికి పురోహితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి చెండి హోమం జరిపించారు. అనంతరం అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు గ్రామస్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు.విగ్రహదాత తలారి లక్ష్మీరాజు,అన్నదాత అన్నమనేని సుధాకర్ రావు లపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదం అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తన్నీరు గౌతంరావు బిజెపి సీనియర్ నాయకులు తన్నీరు ప్రభాకర్ రావు,కోల కృష్ణ ఇతర పార్టీల నాయకులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రార్థిస్తూ పల్లె పట్టణ ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అమ్మవారి భవాని స్వాములు మహిళలు భక్తులు చిన్నారులు తదితరులు పాల్గొని తరించారు.