29-09-2025 08:56:45 AM
అనంతగిరి: మండల కేంద్రంలో శ్రీ రఘునాథ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు భాగంగా కమిటీ సభ్యులు రఘునాథ యూత్(Sri Raghunatha Youth) ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు తీర్థం వెంకటేష్ వారి చేత కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. కమిటీ వారు పూజకు సంబంధించిన సామాగ్రి అందిస్తూ మహిళలకు సహకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను శ్రీ రఘునాథ యూత్ కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతిరోజు రాత్రి బతుకమ్మ పండుగ కార్యక్రమం నిర్వహిస్తూ, దానిలో భాగంగా కోలాటం నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళల అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం శ్రీ రఘునాథ యూత్ ఆధ్వర్యంలో భక్తులందరికీ ఘనంగా నిర్వహించారూ. అన్నదాన కార్యక్రమానికి దాతలుగా బండి నరేష్, గోపి లు గా ఉన్నారు.ఈ దాతలకు ప్రత్యేకంగా గ్రామ పెద్దల చేత కమిటీ సభ్యులు శాలువాలు వేయించి చిరు సన్మానం నిర్వహించారు. ఆ దేవి కృప లు ప్రతి ఒక్కరిపై కలుగుతూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు.