calender_icon.png 29 September, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

29-09-2025 11:18:30 AM

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ రాణి కుముదిని.

రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..

మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. 

తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల(Local body election schedule) ఎన్నికలకు ఎస్ఈసీ రాణి కుముదిని(Rani Kumudini) షెడ్యూల్ ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించింది. రిజర్వేషన్లకు సంబంధించి నిన్న సాయంత్రమే గెజిట్లు విడుదల జరిగిందని రాణి కుముదిని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు, మండలాల్లో రిజర్వేషన్ల ఖరారు జరిగిందని చెప్పారు. 31 జిల్లలు 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 5,749 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 9నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మొదటి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్, అక్టోబర్ 27న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరగనుంది.

అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 31న తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు రాణికుముదిని స్పష్టం చేశారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 8న పోలింగ్ జరగనుంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎస్ఈసీ రాణి కుముదిని సూచించారు.