13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

దేశం కోసం ప్రాణాలను అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్

24-03-2026 12:00 AM

మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్, మార్చి 23 (విజయ క్రాంతి): భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. సోమవారం భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలువురు కార్పోరేటర్ల తో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిరు.

ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడుతూ... 23 ఏళ్ళ వయస్సులోనే దేశం కోసం ఇంక్విలాల్ జిందాబాద్ అంటూ... ఉరి కొయ్యను ముద్దాడిన ధీశాలీ అన్నా రు. సమానత్వం ఉన్న సమాజం రావాలని కలలుకన్న వ్యక్తి అన్నారు. స్వాతంత్య్ర సమరంలో బ్రిటీష్ వారి చేతిలో ఉరితీయబడిన భగత్ సింగ్ మరణం రోజును షహీద్ దివస్ గా జరురుకుంటామని తెలిపారు.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వంటి అమరవీరుల బలిదానాల వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామని తెలిపారు. భగత్ సింగ్ ఆశయాలు, మాటలు నేటి తరం యువతకు స్పూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మా సం గణేష్, భారీ అపర్ణ, జితేంధర్, నాంపల్లి రేణుక శ్రీనివాస్, జితేంధర్, కొమురయ్య, పొన్నం లక్ష్మి మొండయ్య, తదితరులు పాల్గొన్నారు.