13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

24-03-2026 12:00 AM

ముగ్గురి అరెస్ట్, నగదు, మొబైల్ ఫోన్‌లు, బైకులు స్వాధీనం

కోటపల్లి (చెన్నూర్), మార్చి 23 : చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిని సోమవారం కోటపల్లి పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ శివారులో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా .. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, వారిలో ము గ్గురిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకోగా నలుగురు పోలీసులను చూసి అక్క డి నుంచి తప్పించుకొని పారిపోయారు.

అరెస్టయిన జనగాం మల్లేష్, మనుమల్ల అనిల్, గోగు నాగరాజుల నుంచి రూ. 4,050 నగదు, నాలుగు మొబైల్స్, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గోగు రాజేందర్, గోగు సత్తన్న, కుంతి పోషం, మనుమల్ల వినోద్ లు పరారీలు ఉన్నారు. ఈ మేరకు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడిలో కోటపల్లి హెడ్ కానిస్టే బుల్ బుజ్జిబాబుతో పాటు టీజీఎస్పీ కానిస్టేబుళ్లు రాంప్రసాద్, సతీష్, సందీప్, రాజ్ కుమార్, నరేష్‌లు పాల్గొన్నారన్నారు.