27-09-2025 09:32:43 AM
రెండవ వారం ఆరంభమైన గొర్రెల, మేకల సంత
భగీరథ పైప్ లైన్ లీకేజీ, సంతను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జి లక్ష్మారెడ్డి
జడ్చర్ల : ఇటీవల జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మ పేట లో గొర్రెల, మేకల సంతను ప్రారంభించిన విషయం విధితమే. ఈ తరుణంలో రెండవ సంత అయిన శనివారం సంతను మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) జి. లక్ష్మారెడ్డి ప్రత్యేకంగా సందర్శించారు. విక్రయదారులకు, కొనుగోలుదారులకు సంతలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని సంతను మరింత ప్రార్దనతన ఇస్తూ క్రయవిక్రయాలు జరపాలని సూచించారు. అనంతరం ఎన్ హెచ్ 44 పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేసి అన్నిటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.