calender_icon.png 27 September, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలుషిత జలాల వివరాలు ఆధారాలతో ఇవ్వండి

27-09-2025 10:04:17 AM

నేడు అరబిందో ఫార్మా వద్దకు పిసిబి అధికారులు

పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాపల్లి గ్రామాల ప్రజలు రావాలని ఎమ్మెల్యే అనిరుద్  రెడ్డి సూచన 

జడ్చర్ల : అరబిందో ఫార్మా కలుషిత జలలను నేరుగా ఆయా గ్రామాల్లో ఉన్న చెరువులోకి వదులుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) ఈ విషయంపై సంబంధిత అధికార యంత్రాంగం  స్పందించకపోతే ఆ కంపెనీని ఆదివారం తగలబెడతానని శుక్రవారం ఒక వీడియోను విడుదల చేసిన విషయం విధితమే. ఈ విషయంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( పీసీబీ) అధికారులు పోలేపల్లి సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీ వద్దకు ఉదయం 10:30 గంటలకు వచ్చి ఆ కంపెనీ కాలుష్య జలాలను చెరువు లోకి వదులుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాపల్లి గ్రామాల ప్రజలు కంపెనీ దగ్గరికి చేరుకోవాలని పూర్తి ఆధారాలతో అధికారులకు వివరించాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రజలు అలసత్వం ప్రదర్శించకూడదని వెంటనే కంపెనీ దగ్గరికి చేరుకోవాలని ఒక ప్రకటన లో పిలుపునిచ్చారు.