30 August, 2026 | 9:42 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

రెమ్యునరేషన్ తిరిగిచ్చిన పవన్ కల్యాణ్.. ఎందుకంటే..!

04-06-2025 04:59 PM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు(HariHara Veeramallu)'. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చే రెమ్యునరేషన్(Remuneration) తిరిగి ఇచ్చారని, నిర్మాత ఏఎం రత్నం(AM Rathnam)ను ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పవన్ రాజకీయాల్లోకి వచ్చిక ఇక సినిమాలను చేయలేనని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేయక తప్పలేదు.

సిని మేకర్స్ దగ్గర అడ్వాన్స్ లు తీసుకొని, ఆ డబ్బులో జనసేన పార్టీ నడిపించారు. పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన వారిలో ఏఎం రత్నం కూడా ఒకరు. గత ఐదేళ్లుగా హరిహర వీరమల్లు చిత్రం కోసం కష్ట పడుతున్నారు. ఈ ఐదేళ్లలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బీజీగా ఉండడంతో ఆయనకు వీలు కలిగినప్పుడే సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రత్నం సీమా సీజీ వర్క్ అని, రీషూట్స్ అని లొకేషన్స్ అని.. ఇలా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. దీనికి తోడు వీరమల్లు చిత్రం పూర్తయినప్పటికి సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది.

ఎట్టకేలకు  హరిహర వీరమల్లు చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. నిర్మాత ఆర్థిక భారాన్ని పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్, తనకు పారితోషికంగా వచ్చిన రూ.11 కోట్ల అడ్వాన్స్ ను స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, ఎ. దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి(Director Krish) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ కూడా పనిచేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.