calender_icon.png 13 February, 2026 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేపాల్‌కు ఇటలీ షాక్

13-02-2026 12:52:54 AM

టీ20 ప్రపంచకప్‌లో భారత్ జూలు విదుల్చుతోంది. తొలి మ్యాచ్‌లో కాస్త తడబడుతూ గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్‌లో నమీబియాను చిత్తు చేసింది. 94 రన్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసానికి హార్థిక్ పాండ్యా మెరుపులు తోడవడంతో భారీస్కోరు చేసింది. తర్వాత బౌలింగ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిప్పేయడంతో భారీ విజయం సొంతమైంది.

  1. టీ20 వరల్డ్‌కప్‌లో సంచలనం
  2. చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్

ముంబై, ఫిబ్రవరి 12 : టీ20 ప్రపంచకప్‌లో ఇటలీ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. తమ కంటే మెరుగైన నేపాల్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఈ యూరోపియన్ టీమ్ తొలిసారిగా ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని రుచి చూసింది. ఇటలీ క్రికెట్‌లో వరల్ కప్‌కు అర్హత సా ధించడమే తొలిసారి. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి  టీ20 ప్రపంచకప్ 2026 బెర్త్ దక్కించుకుంది.

అరంగేట్రం చేసిన తొలి ఎడిషన్‌లోనే ఆడిన రెండో మ్యాచ్లో ఇలాంటి అద్భుత విజయం సాధించడం గొప్ప విషయమే. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. నేపాల్ ప్రపంచకప్ ఆడడం ఇది మూడోసారి. తమ తొలి మ్యాచ్‌లో నేపాల్ అగ్ర శ్రేణి జట్టు ఇంగ్లాండ్‌ను దాదాపు ఓడించినంత పని చేసింది. అలాంటి జట్టుపై ఇటలీ గెలవడం అంటే మామూలు విష యం కాదు.

మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇటలీ తమ రెగ్యులర్ కెప్టెన్, కీలక ఆటగాడు మ్యాడ్‌సన్ లేకుండానే ఈ మ్యాచ్ ఆడింది. స్కాట్లాండ్‌పై ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన మ్యాడ్ సన్ టోర్నీకి దూరమయ్యా డు. ఈ పరిస్థితుల్లో ఇటలీ నేపాల్‌పై అన్ని విభాగాల్లోనూ అదరగొట్టేసింది. బౌలింగ్ , ఫీల్డింగ్ , బ్యాటింగ్‌లలో తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచు కున్న ఇటలీ నేపాల్‌ను 123 పరుగులకే పరిమితం చేసింది.

ఆ జట్టు స్పిన్నర్లు సమిష్టిగా రాణించి నేపాల్ బ్యాటర్లను తిప్పేశారు. అసలు క్రీజులో నిలదొక్కుకునే అవకాశం కూడా ఇవ్వ లేదు. ఆరిఫ్ షేక్ చేసిన 27 పరుగులే నేపాల్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా ఉంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఎయిరీ , కరణ్ కేసి పర్వాలేదనిపించారు. తర్వాత 124 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుందామనుకున్న నేపాల్ బౌలర్లకు ఇటలీ ఓపెనర్లు, అన్నదమ్ములు మోస్కా బ్రదర్స్ ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. నేపాల్ బౌలర్లను ఉతికారేశారు. ఫోర్లు, సిక్సర్లతో వీరిద్దరూ విరుచుకుపడ్డారు. ఫలితంగా ఇటలీ కేవలం 12.4 ఓవర్ల లోనే టార్గెట్‌ను అందుకుంది. 

జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60.. ఆంథొ ని మో స్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచా రు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100 పరుగులకు పైగా పార్టనర్ షి ప్ నెలకొల్పిన అన్నదమ్ముల జోడీ రికార్డులకెక్కా రు.