రాహుల్ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి
03-05-2024 01:08 AM
హైదరాబాద్, మే 2(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. అనంతరం రాయగఢ్‌లో నివసిస్తున్న తెలుగు వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.




