సివిల్ జడ్జిని సన్మానించిన భట్టి విక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ గెస్ట్ హౌస్ లో శనివారం జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందుని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఘనంగా సన్మానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతెలబోర గ్రామానికి చెందిన కాటూరు సంజీవరావు న్యాయవాది సుశీల దంపతుల కూతురు కుమారి కాటూరి బిందు తన మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాల్వంచ మండల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు హాజరైన వారు ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యర్రం శెట్టి ముత్తయ్య పాల్గొన్నారు.






