calender_icon.png 18 May, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేస్తా

17-05-2025 10:29:37 PM

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి..

కొత్తగూడెం కలెక్టరేట్: హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం కేంద్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) అన్నారు. గతంలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని పలుమార్లు కలిశామని, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. నుంచి కేంద్ర ప్రత్యేక బృందం కూడా వచ్చి సర్వే చేసిందని గుర్తు చేశారు. ఇక్కడి కలెక్టర్.. కేంద్రానికి ఓ రిపోర్ట్ కూడా ఇవ్వబోతున్నారన్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధికి వారు రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నింటీ కంటే ఎక్కువ నిధులు ఇక్కడికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని వివరించారు.