21 March, 2026 | 4:06 PM

అట్టహసంగా శ్రేయాస్ వన్ సిటీ బ్రోచర్ లాంచింగ్

21-03-2026 12:00 AM

ఖమ్మం, మార్చి 20(విజయక్రాంతి): నగరంలోని వందనం రోడ్‌లో శ్రేయాస్ వన్ సి టీ బ్రోచర్ విడుదల కార్యక్రమం అట్టహాసం గా జరిగింది. ఈ బ్రోచర్‌ను సినీ వర్ధమాన నటిమణులు అనుపమ పరమేశ్వరన్, మీనా క్షి చౌదరీలు మార్కెట్‌లోకి విడుదల చేశా రు. అనంతరం వారు మాట్లాడుతూ సినిమా రంగంలో అప్రతిహాతంగా దూసుకెళ్తున్న శ్రే యాస్ మీడియా మొదటిసారిగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిందన్నారు. ఖమ్మం కలెక్టరేట్ కు, గ్రీన్ ఫీల్ హైవేకు అతి చేరువలో ఈ వెంచర్‌ను ప్రారంభించడం శుభపరిణామమన్నారు. అనంతరం శ్రేయా స్ వన్ సిటీలో సింగర్ సునీత ఉపద్రష్ట లైవ్ కాన్సర్ట్‌తో కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో, వినసొంపైన పాటలతో  ఆద్యంతం ఉర్రూతలూగింది.తొలుత ఖమ్మం నగరంలోని సామాజిక సేవ చేసిన వారికి శ్రేయాస్ మీడియాస్ అధినేత గండ్ర శ్రీనివాస్   ఉగా ది పురస్కారాలు -2026 అందించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.