లెక్చరర్స్ కాలనీ అధ్యక్షుడిగా భీమిడి వెంకటరెడ్డి

24-08-2026 | 01:55am

ఎల్బీనగర్, ఆగస్టు 23 : హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ డివిజన్లో ఈనెల 17వ తేదీన జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. కాలనీ సంఘం సంఘం అధ్యక్షుడిగా భీమిడి వెంకటరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు భీమిడి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి కృషిచేసిన కాలనీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాలనీ సమస్యలను అన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల కమిటీ సభ్యులైన బుచ్చిరెడ్డి, సుధాకర్ రావు, నరసింహచారి యాదవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ సంఘం ఉపాధ్యక్షులుగా నర్సిరెడ్డి, బాలరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నరసింహ గౌడ్ సంయుక్త కార్యదర్శిలు గా సుధాకర్ గౌడ్, నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శిగా సంతోష్ కుమార్ రెడ్డి, కోశాధికారిగా లింగయ్య గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు