24 August, 2026 | 2:29 AM

బీసీలను విమర్శిస్తే సహించేది లేదు

24-08-2026 01:57 AM

బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగు వెంకటేశ్ గౌడ్

ఎల్బీనగర్ , ఆగస్టు 23 : బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను, కులవృత్తులను కించపరిస్తే సహించేది లేదని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగు వెంకటేశ్ గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను కులం పేరు లేదా కులవృత్తులను అవహేళన చేసి మాట్లాడితే బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఊరుకోదని, వారి పక్షాన బీసీ పీపుల్స్ ఫెడరేషన్ పోరాడుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ... ఇటీవల కొందరు అగ్రకులాల నాయకులు బీసీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర బహుజన కులాలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు