ఆరెకటిక రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు
24-08-2026 01:54 AM
ముషీరాబాద్, ఆగస్టు 23 (విజయ క్రాం తి): తెలంగాణ రాష్ట్ర ఆరెకటిక ఎన్నికల క మిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఎన్నికల కమిటీ సభ్యులు జమాల్పూర్ బాలరాజ్, డాక్టర్ ని జాంకార్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అక్టోబర్ 2న రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం నాడిక్కడ వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు కమిటీ తెలిపారు.
ఓటర్ నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 1లోపు పూర్తి చేసుకోవాలని సూచించా రు. నమోదు చేసుకోని వారికి ఓటు వేసే, అ ధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఆరెకటిక సమాజ ఐక్యత, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.






