నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భోగి వేడుకలు
పాల్గొన్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్
సికింద్రాబాద్ జనవరి 14 (విజయ క్రాంతి): సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యూ బోయిన్ పల్లి బాపూజీనగర్ నల్ల పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ కళ్యాణ్, రామరావు, పుట్టి నర్సింహా, ప్రేమ్ ముదిరాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
న్యూ బోయిన్ పల్లి చిన్నతోకట్ట బస్తిలో ముకేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పతంగుల పంపిణి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంపన ప్రతాప్ ముఖ్య అతిధిగా హాజరై చిన్నారులకు పతంగులను పంపిణి చేసారు. అదేవిధంగా జేపీయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడక్ పుర చోటు, పెన్షన్లైన్ లో ఆజాం పతంగుల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహ బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు..




