మున్నూరు కాపుల ప్రథమ సమావేశం
హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): మున్నూరు కాపు పొదుపు, పరపతి పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు ఉద్దేశించిన మొదటి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా కోరబోయిన సాం బయ్య, చైర్మన్‌గా మంద ఐలయ్య వ్యవహరించారు. ముఖ్య అతిథిగా డీసీఓ సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతూ.. సహకార సంఘాలు గ్రామీణ, సామాజిక అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సభ్యుల పొదు పు అలవాట్లు పెంపొందించడం, తక్కువ వడ్డీ తో రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయ డానికి ప్రతి సభ్యుడు ఐక్యతతో, బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
అధ్యక్షులు కోరబోయిన సాంబయ్య మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి సభ్యులందరి సహకారం ఎంతో అవసరమని, సభ్యుల సంక్షేమమే సంఘ ప్ర ధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చైర్మన్ మంద ఐలయ్య మాట్లాడుతూ.. సంఘం చేపడుతున్న ప్రస్తుత కార్యక్రమాలను వివరించి, భవిష్యత్తు లో మరిన్ని సంక్షేమ, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. సభ్యు ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంఘా న్ని ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అపెక్స్ కమిటీ, పాలకమండలి సభ్యులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ అప్పల సుధాకర్, డాక్టర్ సుదీప్, పు ప్పాల కిషన్, పుప్పాల తిరుమల్, ఇ.వి. శ్రీనివాస్‌రావు, ఆకుల రాజేందర్, గంటా రవికు మార్, మర్రి జనార్దన్, కటకం పెంటయ్య, గైనేని రాజన్, ఇనుగాల శ్రీధర్, తోట వెంకన్న, ఏనుగుల మానసరాంప్రసాద్, కందుల సృజ న్, గోపాల్, పిట్టల వెంకన్న పాల్గొన్నారు.




