‘తలసాని’పై పోలీసులకు ఫిర్యాదు
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి
అమీర్‌పేట చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
సికింద్రాబాద్, జనవరి14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేటకు చెందిన దేవులపల్లి రవికిరణ్ బుధవారం ఎస్‌ఆర్ నగర్ పోలీస్టే స్టేషన్, సనత్ నగర్ చెందిన త్రికాల మనోజ్ మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అమీర్ పేట చౌరస్తాలో ధర్నా చేసి తలసాని దిష్టబొమ్మను దహనం చేశారు.
సికింద్రాబాద్‌ను కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో తలసాని మాట్లాడుతూ సీఎంను ముక్క లు ముక్కలు చేస్తామని అన్నారని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తలసాని తన స్థాయిని తెలుసుకుని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆండా లు, రాజేశ్వరి, దేవి, అనిత, శ్రీవేణి, పద్మావతి, కృష్ణ యాదవ్, మహేష్, కృష్ణకుమార్, మాణిక్ ప్రభు, సునీత, రాజ్ కుమార్, శీలం జయ, ఎల్లేష్, జయకృష్ణ, రఘుయాదవ్, సాధిక్, హేమం త్, వెంకటేష్, సునీల్, శివకుమార్ తదితరులు ఉన్నారు.




