14-01-2026 06:33:36 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని 2,3,4,5 వార్డుల్లో అర్హులైన 47 మంది లబ్దిదారుల ఇందిరమ్మ ఇండ్ల నూతన నిర్మాణాలకు స్థానిక నాయకులతో కలిసి బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు భూమి పూజ శంకుస్థాపనలు చేసి వారికి ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంతో పేదల సొంతింటి కళ సాకారం అవుతోందని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రమేష్, మున్సిపల్ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్,అంతటి అనయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్, మినుపాల ప్రకాష్ రావు, డైరెక్టర్లు, మాజీ కౌన్సిలర్లు,బిరుదు సమత కృష్ణ, గాజుల రాజమల్లు, ఎండీ నిషాద్ రఫిక్ ,ఉట్ల వర ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు,వేగోళం అబ్బయ్య గౌడ్,దానాయక్ దామోదర్ రావు, సాయిరీ మహేందర్, శ్రీగరి శ్రీనివాస్, పన్నాల రాములు, కార్యకర్తలు, పలు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.