calender_icon.png 14 January, 2026 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మావోయిస్టు కంకణాల రాజిరెడ్డికి కృతజ్ఞతలు

14-01-2026 06:36:34 PM

కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి

కాల్వ శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మాజీ మావోయిస్టు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్  ఇటీవల తెలంగాణ డిజిపి ముందు దాదాపు 30 ఏండ్ల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. రాజిరెడ్డి స్వగ్రామమైన కిష్టంపేటలో బుధవారం మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  రాజిరెడ్డి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఆయన  జనజీవన స్రవంతిలో కలిసిన సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు స్వీట్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.  ఇంటికి వచ్చిన కుమారుడు రాజిరెడ్డి ని చూసి తల్లి ఆనందం అంతా ఇంతా కాదని, తల్లి ప్రేమ ఎంతో గొప్పదో  అన తల్లిని చూసినందుకు ఎంతో గొప్ప ఆనందంగా ఉందని రాజిరెడ్డి తెలిపారని తిరుపతి రెడ్డి తెలిపారు.