14-01-2026 06:29:56 PM
జిల్లా ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్,(విజయక్రాంతి): బాసరలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం రోజున వసంత పంచమి వేడుకలకు పోలీస్ శాఖ పరంగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ వేద పండితులు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత పంచమి రోజున పెద్ద సంఖ్యలో బాసర ఆలయానికి భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతలు సజావుగా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. దీనికి స్పందించిన జిల్లా ఎస్పీ, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణతో పాటు తగిన సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడతామని హామీ ఇచ్చారు.