01-11-2025 12:00:00 AM
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి అత్యవసర చికిత్స అవసరం
విధులు నిర్వహించేది మాత్రం మెడికో విద్యార్థులు, ఎస్సార్లే..
నిజామాబాద్, అక్టోబర్31 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వఆస్పత్రి ఇబ్బందికి అత్యవసర చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే కల్పంతో ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణం చేసింది.
నిత్యం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు జిల్లా నలుమూలల నుండే రా కాకుండా పరుగు రాష్ట్రాల నుండి కూడా పరుగు జిల్లాల నుండి కూడా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో నమ్మకంతో మెరుగైన వైద్యం కోసం రోగులు వస్తుండగా రోడ్డు ప్రమాదాలు వివిధ సంఘటనలో గాయపడిన వారూ నిత్యం వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు.
వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పెద్ద పెద్ద డాక్టర్లు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉంటారని ఎంతో నమ్మకంతో వస్తే... ఆసుపత్రిలో మాత్రం పెద్ద డాక్టర్లు ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పెద్ద పెద్ద హోదాలో పెద్ద డాక్టర్లు అని చెప్పుకుంటూ తాటికాయ అంత అక్షరాలతో బోర్డులు పెట్టుకొని ప్రతి విభాగంలో తమ వంతు కేటాయించుకున్నారు.
ఏ ఒక్కరోజు కూడా వారికి కేటాయించిన పెద్ద డాక్టర్ల తమ విభాగాలలో పూర్తి సమయం కేటాయించడం లేదు. పెద్ద డాక్టర్లకు ఆ కుర్చీ కూర్చుండేందుకు తీరిక లేకుండా అవుతోంది.ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేస్తుంటే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు మాత్రం పెద్ద డాక్టర్ల పనితీరు ఇష్ట రాజ్యాంగా మారింది.
మేమే పెద్ద డాక్టర్లము మాకు ఎవరు అడుగుతారని.... ప్రశ్నిస్తారు... మేము చెప్పిందే వేదం... మేము పెన్ను పెట్టకుంటే వైద్యమే జరగదు.... రోగి బంధువులు చికిత్స చేయాలని ప్రశ్నించిన.... ఎదురించిన తిక్కతిక్క మాట్లాడితే అందరు డాక్టర్లు ఆసుపత్రిలో వైద్య సేవలతో పాటు విధులు బహిష్కరించి. పోలీసులకు కంప్లైంట్ చేసి నిరసన కార్యక్రమం చేపడతామని భయాం దోళన గురి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం..
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వైద్యులకు తిరగబడితే నిజామాబాద్ జిల్లా నే కాకుండా హైదరాబాద్లోని ఏ ఆసుపత్రిలో కూడా మీకు వైద్యం జరగకుండా చూసే దమ్ము మాకు ఉందని రోగి బంధువులకు ఘాటుగా వైద్యులు సమాధానం చెప్పడంతో రోగులు రోజు బంధువులు ఎక్కడ మాకు వైద్యం అందకుండా ఈ వైద్యులు చేస్తామని కరుకొండ గా చెప్పడంతో ఏమి దిక్కుతోచక ఇక్కడ వైద్యులు చెప్పే విధంగానే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోగులు రోగి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి గతంలో ఉన్న సూపర్డెంట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోనీ అన్ని విభాగాలకు సంబంధించిన హెచ్వోడి... ఆర్ ఎం ఓ... తోపాటు ఫిజీషియన్, సర్జన్, పీడియాట్రిక్, గైనకాలజిస్ట్, పలమాలజిస్ట్, సైకియాట్రిస్ట్, ఆర్థోపెడిక్ న్యూరాలజిస్ట్, రేడియాలజిస్ట్, పాతలోజిస్ట్ తో పాటు వివిధ విభాగాల సంబంధించిన వైద్యులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ విభాగాలకు సంబంధించిన రోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వస్తే తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రత్యేకంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
కానీ నూతనంగా ప్రభుత్వ జనరల్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఏ ఒక్క పెద్ద పెద్ద డాక్టర్లైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, తమ విభాలకు సంబంధించిన గదులకు హెచ్ ఓ డి లు అని తమ పేరుతో కూడుకున్న పలకలు బ్రహ్మాండంగా బిగిస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా ఆ గదులను తెరిచి కూర్చున్న దాఖలాలు లేవు.
వారానికి ఒకసారి ఇలా రావడం రిజిస్టర్లు అన్ని సంతకాలు ఒకటే రోజు చేయడం అలా వెళ్ళిపోవడం జరుగుతుందని విశ్వసినీయ సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో శస్త్ర చికిత్సలు, మెరుగైన వైద్య సేవలు అందుతా యని ఆసుపత్రికి వస్తే మాత్రం రోగులకు రోగి బంధువులకు నిరాశే మిగులుతుంది.. ఇదే ఆస్పత్రిలో గతంలో ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు జరిగిన దాఖలాలు ఉంటే ప్రస్తుతం మాత్రం ఇక్కడ అలాంటి ఆపరేషన్లు జరగడంలేదని,,
ఆశస్త్ర చికితకు సంబంధించిన ఆధునిక పరికరాలు అందుబాటులో లేవని, అంతేకాకుండా ప్రత్యేక నిపుణులైన వైద్యులు నియామకం చేయలేదని, రోగి బంధువులకు సమాధానం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మీకు ఇలాంటి శస్త్ర చికిత్సలు జరుపుకోవాలని ఉంటే హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్, లేదా నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లాలని సలహాలు సూచనలు ఇస్తున్నారు.
మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం అందాలంటే అది ఒకటే మార్గమని కరఖండుగా ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి శస్త్రత చికిత్సలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యేక నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నిజామాబాద్ మెడికల్ కళాశాలకు అనుబంధం ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్నత వైద్య శిక్షణ పొందుతున్న ఎస్సార్లు, మెడికో వైద్య విద్యార్థులు మాత్రం వారికి తోచినంత వైద్య పరిజ్ఞానంతో వైద్య చికిత్సలు అందజేస్తున్నారు.
అందులో కొందరైతే ఎస్ ఆర్ లు, జూనియర్ డాక్టర్లు రోగులకు సరైన రీతిలో స్పందితకపోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం రోగులతో పాటు రోగి బంధువులపై పై ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. పెద్ద డాక్టర్లే ఆ తిరుగు ఉంటే నేను చేసేది ఏమైనా ఉందా అని ఈరోజు ఇక్కడ ఉంటాం మా ట్రైనింగ్ కాలం ముగిసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాం నీతోటి మాకు సంబంధం ఏంది అని ఎస్ ఆర్ లాంటి వైద్యులు ఘాటుగా సమాధానం ఇస్తూ రోగుల తోపాటు రోగి బంధువులపై ఒక డాక్టర్ వృత్తిలో ఉండి రౌడీలాగా వ్యవహరించడం జరుగుతుంది.
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి... మేము ఇంతే... మేము ఇలాగే ఉంటాం.. అంత మా ఇష్టమే. ట్రీట్మెంట్ చేసుకుంటే చేసుకోండి లేకుంటే వెళ్లిపోండి అని ఎస్సార్ వైద్యులతో పాటు జూనియర్ డాక్టర్ల మాట తీరు రోగితో తో పాటు రోగి బంధువులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
ఎవరైనా ఆవేదనతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ గాని సంబంధిత అధికారులకు గాని ఫిర్యాదు చేయడానికి పోతే పట్టించుకునే నాధుడే లేడు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పెద్ద వైద్యులతో పాటు చిన్న చిన్న వైద్యులు కూడా ఇష్టం వచ్చినట్లు రోగులతో గొడవలకు దిగుతుంటే ఇక రోగులకు మెరుగైన వైద్య సేవలు ఎక్కడ అందుతాయని రోగులు నిరాశ చెందుతున్నారు.
ఇంత పెద్ద ఆస్పత్రి అయిన ఏ ఒక్కరోజు కూడా జిల్లా మంత్రి గానీ, జిల్లా ఎంపీ, అర్బన్ ఎమ్మెల్యే తో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆకస్మిక తనిఖీలు చేయకపోతే పెద్దపెద్ద డాక్టర్ల ఇష్టం వచ్చినట్లుగా డ్యూటీలు చేస్తూ 30 రోజులు పూర్తి కాగానే విధులకు హాజరు కాకపోయినా చివరి చివరి రోజు విధులకు హాజరై రిజిస్టర్లలో నెలరోజుల సంతకాలు ఒకేరోజు చేసి లక్షల రూపాయలు వేతనాన్ని దర్జాగా అందుకుంటున్నట్లు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది తోపాటు కిందిస్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు.
మరికొందరైతే పెద్దపెద్ద డాక్టర్ల పని తీరుపై సామెతలుగా పేరుకే పెద్ద డాక్టర్..... ఏ ఒక్క రోజు కూడా పని చేయడు...... పుణ్యానికి జీతం అయితే తీసుకుపోతాడు అని బహిరంగానే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి ఒక్కరు సంభాషించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి సంబంధం కలిగి ఉన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గాని, జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి తోపాటు ఎంపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యుల పనితీరుపై దృష్టి సారించి రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అదే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.