calender_icon.png 2 November, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినుల హాస్టల్‌లో యువకులు

01-11-2025 12:00:00 AM

 సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు

ఎల్బీనగర్, అక్టోబర్ 31 : మద్యం మత్తులో అర్ధరాత్రి యువకులు నర్సింగ్ విద్యార్థినుల హాస్టల్లోకి  చొరబడ్డ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురంలోని ఎఫ్ సీఐ కాలనీలో భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ, హాస్టల్ ఉన్నది. ఇక్కడ సుమారు 50 మంది విద్యార్థినులు ఉంటున్నారు. గురువారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో హాస్టల్లోకి గేటు దూకి ప్రవేశించారు.

విద్యార్థినులు ఉంటున్న డోర్లను కొట్టారు. ఎవరు మీరు ఎందుకు వచ్చారు? విద్యార్థినులు ప్రశ్నించగా, వారితో అసభ్యంగా ప్రవర్తించారని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి యువకులను పంపించారు తప్పా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఇలాంటివి పునరావతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ రాణి డిమాండ్ చేశారు. కాగా, ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డింగ్ అయింది.. అంతేకాకుండా ఆన్ లైన్లో రాచకొండ కమిషనర్ ఫిర్యాదు చేశారు.