calender_icon.png 14 January, 2026 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకుసాపూర్‌లో సంక్రాంతి సంబరాలు

14-01-2026 02:06:51 PM

మహిళల ముగ్గుల పోటీ

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం మహిళలతో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో , గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంచ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ జగ్గాని రాజేశం, వార్డు సభ్యులు సామల బాలమల్లు, ముత్తయ్య, రోండ్ల సుకన్య, రేగుల రేఖ, జమున పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల ముగ్గులతో తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించారు.