03-12-2025 06:14:52 PM
వేణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొప్పు వీరస్వామి..
చివ్వెంల (విజయక్రాంతి): గుంజలూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పు వీరస్వామి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ.. చివ్వెంల మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా బలపడుతోందని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురుతున్నదని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరస్వామికి నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు దొనకొండ మహేష్, రబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.