03-12-2025 06:19:36 PM
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లోని పలు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ తో కలిసి ప్రారంభించారు. కార్పొరేటర్ నిధుల నుండి కోటి 85 లక్ష రూపాయలతో పలు కాలనీలలో సిసి రోడ్లు పార్కుల అభివృద్ధి రెడ్డి సమాధిక వాటిక వంటి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేర్చడమే తమ లక్ష్యం అన్నారు.
డివిజన్లోని ప్రజలకు కావలసిన మౌలిక వసతులు పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డిఈ బాలకృష్ణ ఏఈ వినీత్ టిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాచారం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.