13-12-2025 12:04:39 PM
నిత్యం ఇదే తరహాలో పునరావృతం కావడంతో ఓ భక్తుడు ఆవేదన
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు నరసింహారావు
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలోని ఆర్యవైశ్య సత్రంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తుడు మాజీ సత్ర చైర్మన్ కేవి నరసింహారావు ఆందోళన చెందుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ కమిషనర్, మట్టపల్లి ఈవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ ఫిర్యాదు పత్రాన్ని పాత్రికేయులకు అందజేశారు.వారు మాట్లాడుతూ మా తండ్రి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముత్యాలంపాడు గ్రామం నివాసి మట్టపల్లి మహాక్షేత్రము నందు ఆర్యవైశ్య అన్నదాన సత్రమును మా నాన్న 1950 సంవత్సరంలో స్థాపించి ముక్కోటి ఏకాదశి,శ్రీ స్వామి వారి పెద్ద కళ్యాణమమునకు సత్రము నడిపించినారు.
అప్పట్లో ఆర్యవైశ్య సత్రము యందు పందిర్లు వేసుకొని కృష్ణానది నుండి నీరు మోసుకొని వచ్చి అన్నదానము చేసినారు.ఆ తర్వాత దాతల విరాళములతో కొన్ని గదులు భోజనములు చేసేందుకు హాలు కట్టించినారు. అప్పట్లో నరసింహ స్వామి వారి దర్శనమునకు వచ్చు భక్తులకు పరిసర తండాల లంబాడీ తండా వాళ్ళకు మా అన్నదాన సత్రములో భోజనమునకు వచ్చేవారు. మానాన్న బీద వారు పాపం అని వారికి భోజనము పెట్టేవారు. సత్రము యందు నేను 1994లో అధ్యక్షులుగా ఉండి నా యొక్క సేవలు అందించడం జరిగింది. మేము మానాన్న ఉన్నప్పుడు నుండి ఈనాటి వరకు శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రతి ముక్కోటికి లక్ష ఆరెపత్రి పూజ వార్షికముగా చేయించుచున్నాము. 1990 నుండి ఈ సత్రములో నిత్యాన్నదానము చేయుచున్నారు.
ప్రస్తుతము సత్రములోకి వెళ్ళాలంటే ఆర్యవైశ్య యాత్రికులకు చాలా భయంగా ఉన్నది.కారణం ఏమనగా సత్రములో అసాంఘీక కార్యక్రమాలు,వంట మనిషితో పాటు,సత్రములో మేనేజ్మెంటు వారు మద్యం త్రాగడం వలన సత్రములోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి మందిరములో అర్చకత్వము చేసే వారు కూడా మద్యం సేవించి అమ్మవారికి నివేదన చేయుచున్నా పట్టించుకునే వారు లేరు.లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి భక్తులు కోటి ఆశలతో వచ్చి ముక్కులు తీర్చుకుంటున్నారని మహిమ గలిగిన దేవుని సన్నిధిలో ఇలా అపవిత్రం చేయడం తగదని, అధికారులు స్వయంగా విచారించి ఈ క్షేత్రము నందు ఇలాంటి ఈ సత్రాన్ని దేవాదాయ శాఖ వారు స్వాధీనము చేసుకుని మరో మారు ఇలాంటి సంఘటనలకు తావు లేకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కొత్త వెంకట నరసింహారావు అధికారులను కోరారు.