calender_icon.png 13 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ల విజయం... ప్రజల విజయం

13-12-2025 12:11:49 PM

ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు మంథని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలవడం పట్ల  కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ప్రజల విజయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వంలో ఇది ప్రజల విజయమని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని ఆయన తెలిపారు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలందరికీ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.