13-12-2025 12:09:12 PM
15 గ్రామ పంచాయతీలో 11 స్థానాలు కైవసం
మంత్రితో పాటు ప్రజల ఆశీర్వాదం అందుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం
ముత్తారం,(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలు, పాటు ఆశీస్సులతో ముత్తారం మండలంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అన్ని తానై మండలంలో 15 గ్రామ పంచాయతీలకు గాను 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకున్న ఘనత ఆ నాయకుడికే దక్కుతుంది. ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామ సర్పంచ్ నుంచి జడ్పిటిసి పదవులను అలంకరించి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎదిగి, కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తూ గురువారం సర్పంచ్ స్థానాలను గెలిపించుటకు హార్నిశలు పనిచేసిన ఆ నేత చొప్పరి సదానందం శ్రమ మాటల్లో చెప్పలేనంత. మండలంలో కొందరు నాయకులు అధిష్టానం సూచించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు పై కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో అన్ని తానై మెజార్టీ స్థానాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి చొప్పరి చొప్పరి సదానందం స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ సహకారంతో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సదానందం గెలిపించుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, శీను బాబు ల సహకారాలతో వారి సూచనల మేరకు అభ్యర్థులను బరిలో దింపి మండలంలో అధిక స్థానాలను గెలిపించుకున్నమని సదానందం తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు పై శీను బాబు పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సదానందం తెలిపారు