25-10-2025 12:09:35 PM
కర్నూలు: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి(Kurnool bus accident) సంబంధించి కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి ముందు ఒక బైకర్ పెట్రోల్ బంక్‌లోకి ప్రవేశించినట్లు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. శివశంకర్‌గా(Biker Siva Shankar) గుర్తించబడిన బైకర్ తన వాహనానికి పెట్రోల్ నింపడానికి మరో యువకుడితో కలిసి అర్ధరాత్రి 2.20గంటలకు పెట్రోల్ బంక్ లో కనిపించారు. పెట్రోల్ బంక్ లో ఎవరూ కనిపించకపోవడంతో ఓ భయ్యా.. భయ్యా అంటూ అరిచాడు. అనంతరం వెంట వచ్చిన యువకుడితో కలిసి కాస్త ముందుకెళ్లి చూసాడు. ఆ తర్వాత వచ్చి బండిని ర్యాష్ తిప్పడం, బండి స్కిడ్ అవ్వడం, ర్యాష్ డ్రైవ్ చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో శివశంకర్(Siva Shankar) మద్యం మత్తులో(Alcohol intoxication) ఉన్నాడని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. శుక్రవారం కర్నూలు శివార్లలో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో అతను కూడా ఉన్నారు.
శుక్రవారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలోని జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుండి బెంగళూరు(Hyderabad-Bangalore) వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు పిల్లలు సహా 20 మంది ప్రయాణికులు మరణించారు. బాధితుల్లో ఎక్కువ మంది టెక్నీషియన్లు, దీపావళి వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాల నుండి తిరిగి వస్తున్న కుటుంబాలే ఉన్నాయి. బస్సు డ్రైవర్ ఎం. లక్ష్మయ్యతో సహా బస్సులోని ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. మరో 27 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. వారిలో ఎక్కువ మంది బస్సు వెనుక కిటికీల నుండి దూకారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రధాన తలుపు తెరవకపోవడంతో, తప్పించుకోవడానికి పక్క కిటికీలను పగలగొట్టాల్సి వచ్చిందని కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని ప్రాణాలతో బయటపడిన వారు మీడియాతో చెప్పారు.