25-10-2025 01:53:43 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట(Pedda Amberpet) ఓఆర్ఆర్ వద్ద శనివారం ట్రావెల్స్ బస్సు బోల్తా(Travels bus overturns )పడింది. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తున్న 'న్యూ గో' ఎలక్ట్రిక్ బస్సు(ఏపీ 39యూపీ1963) బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి డీఆర్డీవో, హయత్ నగర్ లోని ఆస్పత్రులకు తరలించారు. పఠాన్ చెరువు వద్ద ఔటర్(Outer Ring Road) ఎక్కి పెద్దఅంబర్ పేట్ వద్ద దిగుతున్న సందర్భంలో ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు, ఔటర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కర్నూలు బస్సు దుర్ఘటన(Kurnool bus accident) నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్ ప్రాంతంలోని గగన్ పహాడ్ సహా విజయవాడ-బెంగళూరు హైవేలపై ఆర్టీఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే బస్సులలో అగ్నిమాపక భద్రతా పరికరాలు, వైద్య కిట్‌ల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ఐదు ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పగిలిన అద్దంతో నడిపినందుకు ఒక బస్సును సీజ్ చేశారు. బస్సు జడ్చర్ల సమీపంలో గతంలో ప్రమాదానికి గురైనట్లు ప్రయాణికులు పేర్కొన్నారు.