calender_icon.png 25 October, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం టెండర్లపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

25-10-2025 01:25:54 PM

హైదరాబాద్: మద్యం టెండర్లపై(liquor tendersతెలంగాణ హైకోర్టులో(Telangana High Court) శనివారం వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మద్యం టెండర్ల పొడిగింపుపై ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టెండర్ల గడువు ఏ నిబంధన ప్రకారం పొడిగించారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. టెండర్ల పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని ఏఏజీ ఇమ్రాన్(AAG Imran) తెలిపారు. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని హైకోర్టు సూచించింది. తుదితీర్పునకు లోబడే మద్యం దుకాణాల లైసెన్స్ కేటాయించాలని కోర్టు ఆదేశించింది. మద్యం టెండర్ల గడువు పొడిగించడాన్ని ఐదుగురు వ్యాపారులు సవాల్ చేశారు. టెండర్లకు ఈ నెల 18నే గడువు ముగిసినా.. అబ్కారీ శాఖ 23 వరకు పొడిగించింది. ఈ నెల 18 నుంచి 23 వరకు 5 వేల దరఖాస్తులే వచ్చాయని ఏఏజీ ఇమ్రాన్ హైకోర్టుకు తెలిపారు.