calender_icon.png 25 October, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేధించడంతోనే ఐఏఎస్ ​రిజ్వీ రాజీనామా

25-10-2025 02:08:55 PM

హైదరాబాద్: తెలంగాణలో కొందరు ఐఏఎస్ లు రాజీనామా చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy ) తెలిపారు. సీనియర్ ఐఏఎస్ ​ఆఫీసర్​అహ్మద్ నదీమ్ రిజ్వీ(Senior IAS officer Ahmed Nadeem Rizvi) నిజాయతీ గల అధికారి అని ప్రజలందరికీ తెలుసని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని మానసికంగా వేధించడంతోనే రాజీనామా చేశారని ఆయన తెలిపారు. రాజీనామా నాయకులకు ఐఏఎస్ రిజ్వీ రాజీనామా చెంపపెట్టు అన్నారు. సీఎం, మంత్రులు లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రికొండా సురేఖ కుమార్తె ఆరోపణలు చేశారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణా రావు, ముఠా గోపాల్, బాల్క సుమన్‌తో కలిసి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.