calender_icon.png 25 October, 2025 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉద్యోగాలు కల్పించాలని సంకల్పించాం: మంత్రి ఉత్తమ్

25-10-2025 02:22:56 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రకటించారు. సింగరేణి, టీజీ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ సహకారంతో హుజూర్ నగర్ లో జాబ్ మేళా(Huzurnagar job fair) నిర్వహించారు. హుజూర్ నగర్ మెగా జాబ్ మేళాలో 270 ప్రముఖ పరిశ్రమలు పాల్గొన్నాయి. జాబ్ మేళాలో 36 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

జాబ్ మేళాకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల యువత తరలివచ్చారు. హుజూర్ నగర్ లో భారీ మెగా జాబ్ మేళాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటులోనూ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించామని తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యోగాలు కల్పించాలని సంకల్పించామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.