25-10-2025 01:13:43 PM
కరీంనగర్ క్రైమ్, (విజయక్రాంతి): కరీంనగర్ కోతిరాంపూర్ లో గల పోచమ్మవాడలో హృదయ విదారక ఘటన జరిగింది. వండ్లకొండ లక్ష్మి రాజన్(60) అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి జీవితాన్ని ముగించుకున్నాడు. సూసైడ్ నోట్‌లో ఆవేదనగా రాసిన మాటలు ఇలా ఉన్నాయి. పక్కింటి వారైన మానేరు సుదర్శన్, సరోజతో పాటు మున్సిపల్ అధికారులు ఏసిపి వేణు, టిపిబిఓ సయ్యద్ కాదర్‌లు కలిసి నా ఇంటిపై దాడి ఈ వేధింపులు భరించలేక మానసిక వేదనతో పురుగుల మందు తాగి చనిపోతున్నాను. నా కుటుంబానికి సహాయం చేయండి. అని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.