26-10-2025 03:24:37 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని కృష్ణ పెళ్లి గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇట్టి విషయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి ఎస్సై సర్తాజ్ పాషా చేరుకొని గాయపడ్డ వారిని 108 అంబులెన్సులో బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్యాన్ని కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇందిరిగాం గ్రామానికి చెందిన ఓ మహిళ, కృష్ణ పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా అతివేగంతో ద్విచక్ర వాహనం ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.