26-10-2025 03:13:42 PM
హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 18 మంది మృతదేహాలను డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. బాధిత కుటుంబాలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరే మరణ ధ్రువీకరణ పత్రాలను వారికి అందిచారు. కర్ణాటక, బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలను తమ స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎ.సిరి పర్యవేక్షించారు.
ఈ బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారని, అందులో 18 మృతదేహాలకు మాత్రమే ఆధారాలు లభించాయని, 19వ మృతదేహంపై ఇంకా ఆచూకీ దొరకలేదని అధికారులు వెల్లడించారు. కానీ చిత్తూరు నుంచి ఒక వ్యక్తి వచ్చారని, తన తండ్రి కనిపించడం లేదని చెప్పినట్లు కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. డీఎన్ఏ రిపోర్టు ఆధారంగా 19వ మృతదేహాం తేలుతుందని స్పష్టం చేశారు.
ప్రమాద సమాయంలో బస్సు డ్రైవర్ మధ్యం సేవించలేదని, నివేదికలో తెలిసిందని ఏస్పీ వివరించారు. ఇదిలా ఉంటే కర్నూల్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన శేషగిరి రావు ఫ్యామిలీకి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో చెక్కులు అందజేసింది. వి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరగకముందే బైక్ ప్రమాదం జరిగి శివశంకర్ మృతి చెందాడని ఎస్పీ వెల్లడించారు. బైక్ పై కూర్చున్న ఎర్రస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.