calender_icon.png 26 October, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

26-10-2025 03:17:30 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మున్సిపాలిటీ కేంద్రం జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళల మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున మరిపెడ మున్సిపాలిటీలో జరిగింది. సుమారు 75 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మహిళ గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది మహిళా గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. సదరు మహిళ మరిపెడ మున్సిపాలిటీకి చెందిన దేవరశెట్టి కౌసల్య (75) సంవత్సరాలుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.