13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

బాలికపై లైంగికదాడి, హత్య!?

16-02-2026 01:59 AM

ప్రేమికుల రోజున ప్రియుడి ఘాతుకం!

మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో విషాదం

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ప్రేమికుల రోజున ప్రేమ పేరుతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని నమ్మించి లైంగికదాడకి పాల్పడి, ఆపై హత్య చేశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆదివారం వెలుగు చూసింది. తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) జడ్చర్లలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు జడ్చర్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇరు వురికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇది తెలిసిన బాలిక కుటుంబీకులు హెచ్చరిం చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రేమికుల దినోత్సవం పేరుతో బాలికను గోవర్ధన్ తన బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు.

అది గమనించిన బాలిక తండ్రి.. తన కుటుంబీకులు గ్రామంలో జడ్చర్ల, రైల్వే ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆ చూకీ దొరకలేదు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు విగతజీవిగా పడి ఉన్న బాలికను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోవర్ధన్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ బుర్రి శ్రీనివాసు లు, సీఐ అశోక్‌రెడ్డి తన బృందం పరిశీలించారు. అ నంతరం పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. లైంగికదాడి చేసి,  హత్య చేశారని బాలిక తల్లి, బంధువులు ఆరోపించారు.

ఆ యువకుడుతో పాటు మరో ఇద్దరు యువ కులు కూడా లైంగికదాడికి పాల్పడినట్లు అనుమానం ఉన్నదని, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా గోవర్ధన్ గ్రామంలోని కొంతమంది యువకులతో కిసి గంజాయి సేవిస్తూ ఉండేవాడని తెలసింది. ఈ క్రమంలోనే యువకులు ఘాతుకానికి పాల్పడి ఉంటారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.