18-12-2025 09:27:32 PM
అరుదైన యాదృచ్ఛికం!
'ప్రపంచ కవలల దినోత్సవం' నాడే నిర్మల్‌లోని స్వప్న హాస్పిటల్ లో కవలల జననం
నిర్మల్ (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా కవలల దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక అరుదైన, సంతోషకరమైన ఘటనకు సాక్షిగా నిలిచింది. సరిగ్గా కవలల దినోత్సవం రోజే ఈ ఆసుపత్రిలో కవల పిల్లలు జన్మించడం అందరిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. గైనకాలజిస్ట్ శైలజ నేతృత్వంలో ఒక గర్భిణికి విజయవంతంగా ప్రసవం జరగగా, ఆమె కవలలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.
డాక్టర్ స్వప్న శశికాంత్ ఆనందం
ఈ సందర్భంగా డాక్టర్ స్వప్న శశికాంత్ మాట్లాడుతూ.. "ప్రపంచ కవలల దినోత్సవం రోజే మా హాస్పిటల్‌లో కవలలు జన్మించడం అనేది చాలా అరుదైన, మర్చిపోలేని యాదృచ్ఛికం. వైద్యురాలిగా నాకు ఇది ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. కవలల దినోత్సవం నాడే వారు పుట్టడం ఆ కుటుంబానికి కూడా ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది" అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియడంతో హాస్పిటల్ సిబ్బంది, బంధువులు సంబరాలు చేసుకున్నారు. కవలల దినోత్సవం రోజున పుట్టిన ఆ చిన్నారులకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిరంతరం అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న స్వప్న హాస్పిటల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా స్థానికులు అభినందిస్తున్నారు.