18-12-2025 08:52:27 PM
రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
హనుమకొండ టౌన్/వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ సమగ్ర ప్రగతియే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అందుకోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో 38, 39వ డివిజన్ లలో 2 కోట్ల 68 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 38వ డివిషన్లో సిసి రోడ్లు, డ్రైనేజీల శంకుస్థాపనలతో పాటు కమ్యూనిటీ హాల్ ను, ఖిలవరంగల్ ఈద్గాకు కోటి రూపాయలతో మరమ్మత్తులు చేపట్టడానికి నిధులు మంజూరయ్యాయని అన్నారు.
గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధికి ప్రయత్నాలు చేశానని, ఈ ప్రాంతంలో శాశ్వతంగా నీరు ఉండడం వల్ల మొత్తం ఫ్లోరింగ్ చేపట్టలేక పోయామని అన్నారు. 37వ డివిజన్ ఎంఎం నగర్ లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుని ఆహ్వానం మేరకు ఇల్లు ప్రారంభించడం జరిగిందని వారి కుటుంబానికి బట్టలు పెట్టడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన పేరిట దరఖాస్తుల స్వీకరించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని అన్నారు. స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికే నిర్మించబడి ఉన్నాయని వాటిని త్వరలో నిజమైన అర్హులకు కేటాయిస్తామని అన్నారు.
ప్రజలు తమకు అందజేసే ప్రతి ఫిర్యాదులను నగర మేయర్, కలెక్టర్, కమిషనర్లతో మాట్లాడి ప్రజల అవసరాలు కార్పొరేటర్లతో చర్చించి పలు అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. ఎయిర్పోర్ట్ సమస్యలు దాదాపు పరిష్కారమైందని జనవరిలో ముఖ్యమంత్రి నగరానికి వివిధ ప్రారంభోత్సవాలకు వస్తారని చెప్పారు. వరంగల్ సమీకృత కలెక్టర్ కార్యాల నిర్మాణం పనులు దాదాపు పూర్తయి అని అన్నారు. అంతకుముందు మధ్య కోటలో యాదవ వాడ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలను పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, డిఆర్ఓ విజయలక్ష్మి, కార్పోరేటర్లు బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ సురేష్, బసవరాజ్ కుమారస్వామి, కావేటి కవిత, ఎస్ ఈ సత్యనారాయణ, ఏసిపి శుభం, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.