calender_icon.png 19 December, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

18-12-2025 09:46:07 PM

కేక్ కట్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి..

మహబూబ్ నగర్ టౌన్: రెమ వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి హౌసింగ్ బోర్డ్ కాలనీలో పాస్టర్ పరంజ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి హాజరై ప్రసంగిస్తూ ప్రేమ సంతోషం సమాధానానికి నిదర్శనమే ఈ క్రిస్మస్ పండుగని కొనియాడారు. ఏసు క్రీస్తు ప్రభువు మానవాళి కోసం పంచిన ప్రేమ వర్ణించలేనిదని సందర్భంగా గుర్తు చేశారు.

సంతోషకరమైన వాతావరణంలో క్రిస్మస్ పండుగ వేడుకలను జరుపుకొని అందరికీ ప్రేమ సంతోషం సమాధానం పంచాలని విజ్ఞప్తి చేశారు.  ప్రేమతోనే దేనినైనా సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు.  అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాస్టర్ పరంజ్యోతి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ నాగరాజు సంఘ పెద్దలు దేవయ్య, లక్ష్మన్న, కాట్రావత్ రాజు, శ్యామ్ లతో పాటు అధిక సంఖ్యలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.