calender_icon.png 18 December, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచుల ఫోరం కార్యవర్గ నియామకం

18-12-2025 08:57:06 PM

అధ్యక్షుడిగా అన్నబోయిన తిరుపతి యాదవ్, ఇటిక్యాల రాజు..

సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవిని చెరో రెండున్నర ఏళ్లు పంచుకోవాలని నిర్ణయం..

​వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సర్పంచుల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా జరిగేలా, సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా పని చేయాలని సభ్యులు తీర్మానించారు. ​ఈ నియామకంలో భాగంగా సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవిని చెరో రెండున్నర ఏళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. దీని ప్రకారం మొదటి రెండున్నర సంవత్సరాల పాటు శభాష్ పల్లి సర్పంచ్ అన్నబోయిన తిరుపతి యాదవ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారు.

తదుపరి రెండున్నర ఏళ్ల కాలానికి ఆరేపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ​మండల కార్యవర్గంలోని ఇతర సభ్యులుగా.. ఉపాధ్యక్షులుగా అనుపురం సర్పంచ్ శేర్ల రాజేశ్వరి మల్లేశం, కొడుముంజ సర్పంచ్ కదిరే రాజులను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా కొలుగూరి మధు కిరణ్మయి, అధికార ప్రతినిధిగా గుర్రం వానిపల్లి సర్పంచ్ జ్వాల స్వాతి సురేష్ రెడ్డి, కార్యదర్శిగా మారుపాక సర్పంచ్ దొబ్బల మల్లేశంలను ఎన్నుకున్నారు. అలాగే ఫోరం ముఖ్య సలహాదారుగా ఇటిక్యాల రాజు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, సర్పంచులందరినీ ఏకోన్ముఖంగా ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు నాయకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.