18-12-2025 09:25:27 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): వ్యవసాయంలో వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులను, యంత్ర పరికరాలను వినియోగాన్ని అనుసరించి లాభాల బాట పట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేతలు రైతులకు సూచించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద భారత ప్రత్తి పరిశోధన స్థానం, నాగపూర్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన అధిక సాంద్రత ప్రత్తి సాగు ప్రాజెక్ట్ లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం,ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అధిక సాంద్రత ప్రత్తి సాగుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కేవికే, బెల్లంపల్లి శాస్త్రవేతల సాద్వి మాట్లాడుతూ అధిక సాంద్రత పద్దతిలో ప్రత్తి సాగు విధానం యాజమాన్య పద్ధతులు, పాటించవలసిన మెలకువలు గురించి వివరించారు. తదనంతరం పత్తిలో వచ్చినటువంటి నూతన యంత్రం కాటన్ షేడ్డర్ గురించి రైతులకు అవగాహన కల్పించి ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. ఈ విదంగా వ్యవసాయంలో వస్తునట్టువంటి నూతన పద్ధతులను పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేతలు, రైతులు పాల్గొన్నారు.